Header Banner

ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్...ఒక్కొక్కరికి రూ.15వేలు! బడ్జెట్‌లో తల్లికి వందనంపై కీలక ప్రకటన!

  Fri Feb 28, 2025 11:49        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విద్యారంగానికి భారీగా కేటాయింపులు చేశారు.. తల్లికి వందన పథకంపై తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్‌ తన భుజస్కంధాల మీద వేసుకున్నారన్నారు. 'నేటి బాలలే. రేపటి పౌరులనే' భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళనను మొదలుపెట్టారని.. రిజల్ట్స్‌ ఓరియెంటెడ్‌ ఎడ్యుకేషన్‌ ఫై దృష్టి సారించి.. ఆర్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి టెక్నాలజీ విషయాలను పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారన్నారు.

 

ఇది కూడా చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. కట్ చేస్తే.. తమన్నా, కాజల్‌ను విచారించనున్న పోలీసులు!

 

రాష్ట్రంలో పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది అన్నారు పయ్యావుల కేశవ్. ఏ కారణం చేతనూ ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నామని.. అందుక ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో, మరో నూవర్‌ సిక్స్‌ వోమీని అమలు పరిచే దిశగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ వథకం కింద రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్ధికి తల్లికి వందనం అందించేందుకు కేటాయింపులు చేశామన్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అన్నారు. తల్లికివందనం పథకం కోసం రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు అందిస్తామన్నారు మంత్రి. డొక్కాసీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం మంత్రి నారా లోకేష్ చొరవతో తమ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు కేటాయింపుల్ని ప్రతిపాదించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం, అందరికీ సమాన అవకాశాలను కల్చించడం కోసం బలమైన, సమ్మిళత ఉన్నత విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందన్నారు పయ్యావుల కేశవ్. అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్‌ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సుంవత్షరానికి గాను ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తల్లికి వందనంపై ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.. మే నెలలో పథకాన్ని అమలు చేస్తామని చెబుతోంది.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi#APBudget2025 #GoodNewsForStudents #TalliKiVandanam #StudentWelfare #EducationSupport #AndhraPradesh #15KForStudents #APGovtSchemes